archiveCORONA COVID – 19

News

వచ్చే రెండు నెలలు అత్యంత కీలకం. తస్మాత్ జాగ్రత్త : కేంద్రం హెచ్చరిక

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో అనేక పండగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు....
News

కేరళలో కోరలు చాస్తున్న కరోనా – ఒక్కరోజులోనే 31 వేల కేసులు – రికార్డు స్థాయిలో మరణాలు

కరోనా మూడోదశ వ్యాప్తి భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు విజృంభించాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ తాలూకూ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445...
News

అమెరికాలో ‌మళ్లీ కల్లోలం రేపుతున్న కరోనా

అమెరికాలో కరోనా వైరస్‌ మళ్లీ కల్లోలం రేపుతోంది. గతేడాది అమెరికాని చిగురుటాకులా వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ అక్కడ పడగ విప్పుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. గడచిన 24గంటల...
News

ఆర్‌ ఫ్యాక్టర్‌ పెరగడం ఆందోళనకరమే – రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు

కరోనా సెకండ్‌ వేవ్ ఉద్ధృతితో వణికిపోయిన భారత్‌లో పరిస్థితులు ఈమధ్యే కుదుటపడుతున్నట్లు కనిపించాయి. ఇదే సమయంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై వైద్యనిపుణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొన్ని...
ArticlesNews

సర్వే భవంతు సుఖినః

ఒకాయన మా వీధిలో ఉండే షాపులో ఆశీర్వాద్ ఆటా దొరకలేదని సింగ్ నగర్ నుంచి పటమటకి వెళ్లి ఆటా తెచ్చుకుంటున్నాడు. ఎప్పుడూ వాకింగ్ చెయ్యనాయన లాక్ డవున్ లో ఖాళీగా ఉన్నాం కదా అని వాకింగ్ పేరుతో ఎప్పుడూ రోడ్ మీదే...
News

కరోనా తొలగిపోయిందనే భ్రమలో బ్రతక్కండి – కేంద్ర ఆరోగ్య శాఖ

దేశంలో కరోనా రెండో దఫా విజృంభణ ఇంకా ముగియలేదని, వైరస్ మన మధ్య నుంచి తొలగిపోయిందనే భ్రమలో బతకొద్దని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగుచూసిన దృశ్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది....
NewsProgrammsSeva

కరోనా బాధిత దివ్యాంగులకు సక్షమ్ చేయూత

రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడిన దివ్యాంగులకు సక్షమ్ సంస్థ పలు విధాలుగా చేదోడుగా నిలుస్తోంది. విజయవాడ సమీపంలోని కొటికలపూడి గ్రామంలో దివ్యాంగులు ఉన్న 30 కుటుంబాలకు సక్షమ్ రేషన్ కిట్లు అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి అఖిలభారత అధ్యక్షులు...
News

క్రొత్త వేరియంట్లనూ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి – కేంద్రం

దేశంలో కొత్తగా వెలుగు చూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా బయటపడుతోన్న రకాల వ్యాప్తి, తీవ్రతను బట్టి వాటిని వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌, వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్ గా విభజిస్తామని ప్రభుత్వం...
News

ఇప్పుడే పాఠశాలలు తెరవద్దు – నీతి ఆయోగ్ హెచ్చరిక

కోవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు....
News

డెల్టా వేరియంట్ పై ఆందోళన వద్దు.. ఔషధాలకు లొంగుతుంది – శాస్త్రవేత్తల వెల్లడి

కరోనా వైర‌స్ తీవ్ర వ్యాప్తికి కార‌ణ‌మైన‌ డెల్టా వేరియంట్ మార్పుచెంది, డెల్టా ప్లస్ లేదా ఏవై 1గా కొత్త రూపం సంత‌రించుకుంది. అయితే ప్ర‌స్తుతానికి దేశంలో ఇది చాలా త‌క్కువ‌గానే క‌నిపిస్తోంద‌ని, దీని గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు...
1 2 3
Page 1 of 3