News

అలిపిరి కాలిబాట రెండు నెలలు మూసివేత…

537views

లియుగ వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొనే భక్తులకు.. కాలిబాట మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తితిదే చర్యలు చేపట్టింది. ఆధునికీకరణలో భాగంగా అలిపిరి – తిరుమల మెట్ల మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలిపిరి కాలిమార్గంలో శిథిలావస్థకు చేరుకొంటున్న పైకప్పు కాంక్రీట్‌ స్లాబును తొలగించి గాల్వలూమ్‌ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్‌ సంస్థ తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.30 కోట్లు విరాళంగా అందచేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.