
547views
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమైనట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన మావోయిస్టును మలంగీర్ ఏరియా కమిటీ సభ్యుడు కోసగా గుర్తించారు. అతనికి 15 కేసులతో ప్రమేయం ఉండటంతో పాటు తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. నీలవాయి అడవుల్లో జిల్లా రిజర్వు గార్డ్స్, నక్సల్స్ వ్యతిరేక దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మావోయిస్టు హతమైనట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ చెప్పారు.
ఘటనా స్థలం నుంచి 9 ఎమ్‌ఎమ్ పిస్టల్, దేశవాలీ బార్మర్, మూడు కిలోల పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బీజాపూర్ ఎదురు కాల్పుల్లో 22 మంది జవాన్లు అమరులైన తర్వాత జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు.





