News

ఇరుముడితో శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్

793views

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదివారం సాయంత్రం శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. పంబా నది ఒడ్డున ఉన్న గణపతి ఆలయం దగ్గర ఇరుముడి ధరించి స్వామి అయ్యప్ప నడక దారిలో ఆయన సన్నిధానం చేరుకున్నారు.

ఆయనను వళ్ళియ నాథ పండల్ వద్ద ట్రావెన్ కోర్ దేవాశ్వమ్ బోర్డు అధ్యక్షులు శ్రీ ఎన్ వాసు, దేవాశ్వమ్ బోర్డు సభ్యులు శ్రీ కె ఎస్ రవి, దేవాశ్వమ్ కమిషనర్ శ్రీ బీఎస్ తిరుమేణి లు స్వాగతం పలికారు.

https://www.facebook.com/KochattilSuresh/videos/10158098554453848/?t=66

పడి పూజ అనంతరం ఆయన 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఆయన దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాలికప్పురం దేవస్థాన ప్రాంగణంలో ఒక గంధపుచెట్టును నాటారు. ఆయనతో ఆయన చిన్న కుమారుడు శ్రీ కబీర్ మహమ్మద్ ఖాన్ కూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.