
రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తదితరులకు ఆ బృందంలో స్థానం కల్పించారు. గతేడాది సెప్టెంబర్ 20 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన విగ్రహాల ధ్వంసం కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఫొరెన్సిక్, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగాల సహకారం తీసుకోవాల్సింది ప్రభుత్వం సిట్‌కు సూచించింది.
మరోవైపు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.





