హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారం కేసు : బుధవారం విచారించనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం

హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్, ట్విట్టర్ ఇండియాలపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం దీనిని విచారించనుంది.
హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుత కోర్టు చర్యలను ధిక్కరించడానికి గల కారణం స్పష్టంగా తెలియకపోయినా, ప్రశాంత్ భూషణ్ ‘అర్బన్ నక్సల్’ వరవరరావుపై ట్వీట్ చేయడం వల్ల ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది. ఎల్గర్ పరిషత్ కేసులో నిందితుడైన వరవరరావుకు అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించినట్లు ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒకవేళ వరవరరావు మరణిస్తే అది ‘జ్యుడిషియల్ హత్య’ అవుతుందని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. కోర్టు ఆగ్రహానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.

ప్రశాంత్ భూషణ్ ఇటీవలి కాలంలో అనేక సందర్భాల్లో న్యాయవ్యవస్థను విమర్శించారు. లాక్‌డౌన్ సమయంలో తాను “రామాయణం” సీరియల్ చూస్తున్న దృశ్యాన్ని ట్విట్టర్‌లో పంచుకున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్‌పై ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇటీవలే సుప్రీంకోర్టు ఆయనను చీవాట్లు పెట్టింది.

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి సమయంలో జైళ్లలోని నిందితుల భద్రతకు సంబంధించి న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జూన్లో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని హైకోర్టులకు తీసుకెళ్లమని ఆదేశించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను న్యాయవాది ఉపసంహరించుకుంటారా? లేదా కోర్టు కొట్టివేయాలా? అని ప్రశ్నించింది.

సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా తీర్పులు, ఉత్తర్వులు ఇవ్వని సందర్భాలు ఈ మధ్యకాలంలో అనేకం ఉన్నాయి. ఈ కారణంగా సహనం కోల్పోయిన ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థపై తీవ్రమైన కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Source : OPINDIA





