News

ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం

1.1kviews

పూర్తయిన తర్వాత, అయోధ్యలోని రామాలయం ప్రపంచంలో మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందనుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చైర్మన్ మహంత్ నృత్య గోపాల్ దాస్ ప్రతినిధిగా నియమించబడిన మహంత్ కమల్ నయన్ దాస్ తెలిపారు.

“ప్రస్తుతం ఉన్న ఆలయ నమూనాలో కొన్ని మార్పులు చేస్తున్నారు. అయితే, ప్రాథమిక స్వరూపం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుంది. వాస్తుశిల్పులు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముందు కొత్త లేఅవుట్ యొక్క స్కెచ్ ను సమర్పించారు” అని మహంత్ కమల్ నయన్ దాస్ వెల్లడించారు.

ప్రాజెక్ట్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా కుమారులు ఆర్కిటెక్ట్స్ నిఖిల్ సోంపురా, ఆశిష్ సోంపురాలు ఈ కొత్త డిజైన్‌ను తయారు చేస్తున్నారు.

అందిన సమాచారం మేరకు, కొత్త ఆలయ వెడల్పు 140 అడుగుల నుండి 270- 280 అడుగులకు, పొడవు 268 నుండి 280-300 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది.

Source : Indus scrolls

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.