News

జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్

461views

పాకిస్థాన్‌ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, భారత్‌లోని అన్ని ప్రాంతాలకు చొచ్చుకెళ్లేందుకు కూడా వీరు సదరు వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఎల్‌వోసీ సమీపంలో ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్ల వద్ద పాక్‌ ఆయుధ సమీకరణను పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాదులు ఏకమై వీటిని సమీకరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయుధాల పంపిణీకి పాక్‌ ఆక్రమిత కశ్మీరు ప్రాంతంలో భారీ డంప్ ఏర్పాటు చేయడాన్ని గుర్తించినట్టు అధికారులు వివరించారు. ఉగ్రవాద సంస్థ అల్ బదర్-తాలిబన్ కమాండర్ హమీద్‌ఖాన్ రే భారీ డంప్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. డ్రోన్ల ద్వారా కశ్మీర్‌కు పంపేందుకు ఇక్కడ ఆయుధాలను సిద్ధం చేసినట్లు గుర్తించామన్నారు. భారత్‌లో చొరబడేందుకు 70 మందికి పైగా ఉగ్రవాదులు పొంచివున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.