News

కేరళ బంగారు స్మగ్లింగ్ కుంభకోణం: దుబాయ్‌లో ఫైజల్ ఫరీద్‌ అరెస్టు

600views

బంగారు అక్రమ రవాణా కేసులో మూడవ నిందితుడు ఫైజల్ ఫరీద్‌ను జూలై 19 న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ నుంచి అరెస్టు చేశారు. దుబాయ్ పోలీసులు ఫరీద్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌లోని అల్ రషీదియా పోలీస్‌స్టేషన్‌లో అతన్ని ప్రశ్నిస్తున్నారు.

దుబాయ్ పోలీసులు త్వరలో ఫైజల్‌ను భారత్‌కు అప్పగించాలని భావిస్తున్నారు. ఫైజల్ ఫరీద్‌పై ఎన్‌ఐఏకు ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చింది.

నివేదికల ప్రకారం, దౌత్య మార్గాల ద్వారా స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని కేరళకి చేరేలా ఫరీద్ ఏర్పాటు చేశాడు. CAA వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించిన కేరళలో ఉన్న ఇస్లామిస్ట్ సంస్థలతో ఫైజల్ కు సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక వర్గం మీడియా ఫరీద్‌కు అనుకూలంగా వార్తలు వ్రాసింది. నకిలీ వార్తలతో యుఎఇలో అతని ‘వ్యాపారాన్ని’ దెబ్బతీసే కుట్రగా సదరు మీడియా పేర్కొంది.

ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తుకు అనుమతిస్తూ, వ్యవస్థీకృత స్మగ్లింగ్ ఆపరేషన్ జాతీయ భద్రతకు ‘తీవ్రమైన చిక్కులు’ కలిగిస్తుందని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికే  నిందితులు ఈ స్మగ్లింగ్ కు పాల్పడ్డారని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

కాన్సులేట్ యొక్క ఇద్దరు మాజీ ఉద్యోగులు స్వప్నా సురేష్ మరియు పి ఎస్ సరిత్ కుమార్ ఈ కేసులో మొదటి మరియు రెండవ నిందితులు. సందీప్ నాయర్ నాల్గవ నిందితుడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.