
559views
జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని అన్నిపొరా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లా కేంద్రానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్షీపురా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సైనికుల రాకను పసిగట్టిన ఉగ్రమూకలు వారి నుంచి తప్పించుకునేందుకు కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.