News

దర్శనాలు ఆపండి : రమణ దీక్షితులు

675views

శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మరోసారి ట్విటర్‌లో స్పందించారు. కొన్ని వారాల పాటు శ్రీవారి దర్శనానికి భక్తుల అనుమతి నిలిపివేయాలని తితిదే అధికారులకు సూచించారు. శ్రీవారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకుల స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని, అర్చకులను సంరక్షించి స్వామివారికి పూజలు ఏకాంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో 50 మంది అర్చకులు పని చేస్తున్నారని..వారిలో 15 మంది కొవిడ్‌ బారిన పడినా తితిదే ఈవో, అదనపు ఈవో శ్రీవారి దర్శనాలను ఆపడంలేదని తితిదే ఆగమ సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణ దీక్షితులు గురువారం ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.