News

News

‘భారత్‌ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’ పాక్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర చర్చ

పాకిస్తాన్ ఎంపీ సయ్యద్ ముస్తాఫా కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశ పార్లమెంటులో భారత్ సాధిస్తున్న ఘనతలు ప్రస్తావించారు. భారత్ చంద్రుడిపై అడుగుపెడుతుంటే, పాకిస్తాన్ పిల్లలు గట్టర్లలో పడి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ (MQM-P) ఎంపీ సయ్యద్ ముస్తఫా కమల్ పాకిస్తాన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ ఆ దేశంలో నెలకొన్న సమస్యలు ప్రస్తావించారు. కరాచీలో చాలామంది చిన్నారులు మురికి కాల్వల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కరాచీలో తాగునీటి కొరత గురించి కూడా చర్చించారు. రెండు ఓడరేవులతో దేశానికి గేట్ వేగా ఉన్న కరాచీలో 15 ఏళ్ళగా పరిశుభ్రమైన తాగునీరు అందించలేకపోతున్నామన్నారు. నీటి మాఫియా ట్యాంకర్లను అమ్ముకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధ్‌ ప్రావిన్స్‌లో దాదాపు 70లక్షల మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లడం లేదన్నారు. 48వేల పాఠశాలలు ఉంటే అందులో...
News

తిరుపతి గంగమ్మ జాతరలో మూడో రోజు బండవేషం

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మూడో రోజు బండవేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. శరీరమంతా బొగ్గు పూసుకుని అక్కడక్కడ కుంకుమ బొట్లు పెట్టుకుని ఈరోజు ఉదయం నుంచి ఆలయానికి చేరుకుంటున్నారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరస్వామి చెల్లెలుగా విరాజిల్లుతోంది తిరుపతి గంగమ్మ...
News

భారత మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస క్షమాపణలు

భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్ అనిల్ కాలె(46) మృతికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంతాపం తెలియజేసింది. గాజాలో ఐరాస తరపున విధులు నిర్వహిస్తూ కాల్పుల్లో కాలె మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఐరాస...
News

మెషిన్‌గన్‌తో విరుచుకుపడే ‘హెక్సాకాప్టర్‌’, సైన్యంలోకి సరికొత్త డ్రోన్‌

భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. మెషిన్‌గన్‌తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెక్సాకాప్టర్‌ డ్రోన్‌ను భారత సైన్యం పరిచయం చేసింది. ‘మేకిన్‌ ఇండియా’లో భాగంగా ఇక్రాన్‌ ఏరోస్పేస్‌ అండ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దీన్ని రూపొందించింది. ఇదొక మానవ...
ArticlesNews

వియత్నాం రాజుకి స్ఫూర్తినిచ్చిన మహారాణా ప్రతాప్

ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాతో 20 ఏళ్లు పోరాటం చేసి దాని సాధించిన విజయం తర్వాత వియత్నాం అధ్యక్షుడిని ఒక విలేకరి ఇలా ప్రశ్నించాడు. మీరు అమెరికాను ఎలా ఓడించారో ఎవరికీ అంతుబట్టడం లేదని అన్నాడు. ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి వియత్నాం...
News

తిరువీధిలో అహోబిలేశుడు

వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. అహోబిలేశుడు విశేష అలంకృతుడై వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. బుధవారం ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహస్వామి యోగానృసింహ అలంకరణలో గరుడ విమాన పల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువుదీరారు. వేదపండితులు స్వామి,...
News

సీఏఏ కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురైన ముస్లిమేతర వలసదారులు భారతీయులుగా గుర్తింపు పొందారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా 14 మంది దరఖాస్తుదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేశారు. బుధవారం సీసీఏ కింద ఢిల్లీలోని 300 మందికి భారత పౌరసత్వ సర్టిఫికెట్లు అందజేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. కాగా, పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో వేధింపులకు గురై భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియను 2019లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీని కోసం పౌరసత్వ చట్టాన్ని సవరించింది....
News

‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్‌ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌(పీఓకే) ఎప్పటికీ భారత్‌దేనని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న ఆందోళనలపై కోల్‌కతాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ‌జైశంకర్‌ స్పందించారు. పీఓకేలో ఉన్న ప్రజలు తమ జీవన ప్రమాణాలు, జమ్మూకాశ్మీర్‌లో ఉన్న ప్రజల జీవన...
1 1,484 1,485 1,486 1,487 1,488 3,061
Page 1486 of 3061