93
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో మూడో రోజు బండవేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. శరీరమంతా బొగ్గు పూసుకుని అక్కడక్కడ కుంకుమ బొట్లు పెట్టుకుని ఈరోజు ఉదయం నుంచి ఆలయానికి చేరుకుంటున్నారు. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరస్వామి చెల్లెలుగా విరాజిల్లుతోంది తిరుపతి గంగమ్మ తల్లి. ఆలయ ఆవరణలో పొంగళ్ళు పెడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కళాబృందాలతో ఊరేగింపుగా సారెను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. పద్మావతి పురం నుంచి గంగమ్మ ఆలయం వరకు సారె ఊరేగింపు జరిగింది. ప్రభుత్వం తరఫున భూమన కరుణాకర్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు.