వర్షం ప్రకృతి అంత ప్రాచీనం
ప్రపంచమంతటా సృష్టి గాథలు ఒక్కలాగానే ఉంటాయి. ఆదిలో అంతా జలమయమే. ఎందుకని? బ్రహ్మాండమంత కుండతో ఎత్తిపోసినట్టు నిరంతరం ధారాపాతాలు. ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టాయి. భూమిపైకి తేలింది. జీవి పుట్టింది. మనిషి సహా రకరకాల రూపాల్లోకి పరిణామం...







