ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణంలో మరో మైలురాయి చేరింది. పీఎస్ ఎల్వీ-సీ44 రాకెట్ను గురువారం అర్ధరాత్రి విజయవంతంగా ప్రయోగించారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు, విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు చేసుకునేందుకు ఇది 6 నెలలపాటు ఉపయోగపడనుంది. ఈ రాకెట్ ద్వారా తొలుత రక్షణ రంగానికి చెందిన మైక్రోశాట్-ఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆపై రాకెట్లోని నాలుగో దశను వ్యర్థంగా వదిలేయకుండా మరింత ఎత్తులోకి తీసుకెళ్లి అంతరిక్ష పరిశోధనలకు వేదికగా ఉపయోగపడేలా తీర్చిదిద్దింది. ఈ దశలో కలాంశాట్-వీ2 అనే బుల్లి ఉపగ్రహాన్ని ఉంచింది. ప్రయోగం ఇలా... ఈ నానో శాటిలైట్ను తమిళనాడుకు చెందిన విద్యార్థులు తయారు చేయడం విశేషం. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం అర్ధరాత్రి 11.37 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డీఆర్డీవోకు చెందిన 700...







