NewsProgramms

మొక్కలు నాటిన భక్త కన్నప్ప గురుకులం చిన్నారులు.

67views

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలోని భక్తకన్నప్ప గురుకులం ఆవాసం లో 18.8.2019 ఆదివారం నాడు  వనంమహోత్సవం కార్యక్రమం  జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా ITDA  అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ L. భాస్కర్ రావు ,సున్నిపెంట , శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం కార్యదర్శి శ్రీ సోమయాజుల నాగేశ్వరావు,  కర్నూలు విభాగ్  సంఘచాలక్ శ్రీ G. రఘురామయ్య, భక్తకన్నప్ప గురుకులం ఆవాస కార్యదర్శి శ్రీ M. రఘురాములు, స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ T. వెంకటరమణ, ఆవాస ప్రముఖ్ శ్రీ M. రామకృష్ణ మరియు ఆవాస విద్యార్థులు పాల్గొని ఆవాస ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆ మొక్కలను సంరక్షించే బాధ్యతను ఆవాసంలోని బాలలు స్వీకరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకుని దాని సంరక్షణ బాధ్యత వహిస్తామని చిన్నారులు తెలిపారు.