News

అభినందన్ కు వీర్ చక్ర

362views

వింగ్‌ కమాండర్‌ అభినందన్‌.. అతడు చేసిన సాహసాన్ని భారత ప్రజలు ఎప్పటికీ మరువరు. భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని అభినందన్ మిగ్ విమానంతో కుప్పకూల్చిన సంగతి తెలిసిందే. మిగ్ తో పోలిస్తే ఎఫ్-16 యుద్ధ విమానం ఎన్నో రెట్లు శక్తివంతమైంది. అయినా అభినందన్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు.. దాన్ని కుప్పకూల్చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో అభినందన్ విమానం కూడా కూలిపోవడంతో పాక్ సైన్యానికి దొరికాడు. అక్కడ అభినందన్ ను ఎంత హింసించినా ఒక్క విషయాన్ని కూడా బయటపెట్టలేదు. ఆ తర్వాత మూడు రోజులకు పాక్ నుండి అభినందన్ భారత్ కు చేరుకున్నాడు. అంత సాహసం చేసిన వర్ధమాన్‌కు కేంద్రం ‘వీర్‌ చక్ర’ ప్రకటించారు

అభినందన్ పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడాన్ని తాను కళ్లారా చూశానని స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ తెలిపారు. ఆ సమయంలో నేను అభినందన్‌కు వాతావరణ పరిస్థితులు తెలియజేస్తూ స్క్రీన్‌పై గమనిస్తున్నానని తెలిపారు. యుద్ధ సమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ప్రభుత్వం ఇచ్చే యుద్ధ సేవా పతకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్క్వాడ్రన్‌ లీడర్‌ మింటీ అగర్వాల్‌ అందుకుంది. ఈ పురస్కారం అందుకున్న తొలి మహిళగా మింటీ అగర్వాల్‌ చరిత్ర సృష్టించింది.