NewsProgramms

నంద్యాల సంఘమిత్ర అధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్

63views

శ్రావణ పౌర్ణిమను పురష్కరించుకొని సంఘమిత్ర ఆధ్వర్యంలో నంద్యాల చివరి బస్తీలైన పీవీ నగర్ మరియూ అరుంధతీ నగర్ లలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా ఎంతో వేడుకగా జరిపారు.

సదరు కార్యక్రమంలో సంఘమిత్ర రాష్ట్ర సహ కార్యదర్శి మనోహర్ జీ, ఉపాధ్యక్షడు జీనపల్లి వెంకటేశ్వర్లు, కార్యదర్శి, ఆర్ యస్ యస్ నంద్యాల సంఘచాలక్ చిలుకూరు శ్రీనివాస్,  శ్రీ వెంకటయ్య, ఆవాస్ ప్రముఖ్ గంగాధర్, అభ్యసికల ఉపాధ్యాయినులు సుజాత, ప్రవీణ స్థానిక పెద్దలు వెంకటేశ్వర్లు, శేఖర్, ఏ. శేఖర్,  మనోహర్, శరత్ మరియు వారి మిత్రులు పాల్గొన్నారు.

ప్రధాన వక్త శ్రీ రంగయ్య రక్షాబంధన్ పౌరాణిక నేపధ్యాన్ని ప్రస్థావిస్తూ ప్రచారంలో ఉన్న ఎన్నో కథలను తెలయజేసి చిన్నారులను చక్కగా అలరించారు. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మనమందరం దేశానికి రక్షగా ఉండాలని మన చుట్టూ జరుగుతున్న జాతి వ్యతిరేక కార్యక్రమాలను మనందరం ఐకమత్యంగా ఉండి తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. మాజీ సైనికాధికారి వెంకటయ్య మాట్లాడుతూ ప్రస్తుతం భారత ప్రభుత్వం తీసుకుంటున్న సాహసో పేత నిర్ణయాలను దానికి అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును ప్రస్తావిస్తూ మనం బలహీనంగా ఉన్నపుడు అసాధ్యంగా అనిపించిన ఎన్నో విషయాలు మనం బలవంతులుగా దృఢమైన నిర్ణయం తీసుకున్నపుడు గడ్డిపోచలుగామారి అడ్డుతొలగి సలాములు కొట్టి ఆహ్వానిస్తాయని ఋజువైందని తెలియజేస్తూ మనం అందరం చక్కగా చదువుకొని దృఢమైన పౌరులుగా ఎదగాలని తెలియజేశారు. స్థానిక పెద్దలు మాట్లాడుతూ అందరూ చక్కగా చదువుకొని బాధ్యత గల పౌరులుగా ఎదగాలని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆవాస్ ప్రముఖ్ గంగాధర్, అభ్యసికల ఉపాధ్యాయినులు సుజాత, ప్రవీణ స్థానిక పెద్దలు వెంకటేశ్వర్లు, శేఖర్, ఏ. శేఖర్,  మనోహర్, శరత్ మరియు వారి మిత్రులు పాల్గొన్నారు.