News

నంద్యాలలో ఘనంగా రక్షాబంధన్ – ఆలోచింపజేసిన భారత్ దర్శన్

86views

రక్షాబంధన్ :

కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర ఆవాస ప్రాంగణంలో ‘సక్షమ్’ నగర అధ్యక్షులు డా. నేట్ల మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం మరియూ రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అథితిగా డా. మహేంద్రకుమార్ రెడ్డి గారు ప్రధాన వక్తగా సేవా భారతి రాష్ట్ర సహ కార్యదర్శి మనోహర్ జీ గారు పాల్గన్నారు.

సదరు కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షడు జే. వెంకటేశ్వర్లు గారు కార్యదర్శి చిలుకూరు శ్రీనివాస్ గారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు వై యన్ విష్ణువర్దన్ రెడ్డి గారు. సుబ్బారావు గారు మురళీకృష్ణగారు హరిబాబు గారు వారి మిత్ర బృందం దివ్యాంగ సోదరులు పాల్గొన్నారు.

ముఖ్య అథితి డా. మహేంద్రకుమార్ రెడ్డి గారు జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కో కార్యం నిర్వర్తించుటకు సృష్టిస్తాడని అమూల్యమైన మానవ వనరులను వారిలో సామర్థ్యాన్ని పెంచి సమాజంలో సమున్నత స్థానం కల్పించాలని పిలుపు నిచ్చారు.

ప్రధాన వక్త మనోహర్ గారు మాట్లాడుతూ “కంకర్ కంకర్ మె శివశంకర్ హై” అంటూ ప్రతి అణువులో పరమాత్ముని దర్శించే మనం మనతో పాటు అన్నింటా సర్వ హక్కులు కల్గిన దివ్యాంగ సోదరులను సమదృష్టితో చూసి వారిలో క్షమతా వికసానికి కృషి చేసి ఈ దేశ పురోభివృద్దిలో వారిని కూడా అను సంధానించ వలసిన బాధ్యత మనందరం రక్షాబంధన్ సంకల్పంగా తీసుకోవాలని పిలుపు నిచ్చారు. అప్పుడే “సబ్ కా సాత్ సబ్ కా వికాస్” కల సాకారమౌతుందని తెలియ జేశారు.

భారత్ దర్శన్ :

 కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక సాయిబాబా నగర్ శ్రీశైల ఉన్నత పాఠశాల ఆవరణలో నగర్ శారీరక్ ప్రముఖ్ నరసింహ, భాగ్ చార్ శారీరక్ ప్రముఖ్ నాగరాజు స్థానిక స్వయం సేవక్ మధుసూదన్ ల ఆద్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం విజ్ఞాన దాయకంగా జరిగింది.

జిల్లా సేవా ప్రముఖ్ వేణుగోపాల్ గారు ప్రధాన వక్తగా పాల్గొని అఖండ భారత్ చిత్రపటం సహాయంతో ఆనాటి పాలకులకు దేశభక్తి, దేశంపట్ల చిత్త శుద్ది లోపించడం కారణంగా ఎలాముక్కలైందో సోదాహరణంగా వివరించారు.
మనం ఈనాడు ఎదుర్కొంటున్న భద్రతా సమస్యలన్నింటికీ ఆనాటి తప్ఫిదాలే కారణమని తెలియజేశారు.

ఆనాటి తప్పిదాలను సరిచేసి తిరిగి మన భరత మాత పూర్వవైభవాన్ని సాధించడమే మన రక్షాబంధన్ సంకల్పం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటయ్య స్థానిక స్వయం‌సేవకులు పాల్గొన్నారు.