NewsProgramms

జయభారత్ హాస్పిటల్ లో ప్రారంభమైన “సంజీవని”

223views

నెల్లూరులోని పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అతి తక్కువ ఖర్చులో లాభాపేక్ష లేకుండా అందించాలన్న ఆశయంతో జయభారత్ హాస్పిటల్ పనిచేస్తున్నది. ఇందులో భాగంగా అత్యాధునిక పరికరాలతో, మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉదేశ్యంతో కొత్తగా”సంజీవని వైద్య సేవా పథకం” సక్షమ్ అఖిల భారత సంఘటనా కార్యదర్శి  డా.సుకుమార్ గారి,  చేతుల మీదుగా ప్రారంభించటం జరిగింది. ఈ పథకంలో శాశ్వత సభ్యులుగా చేరిన వారు రూ.1,50,000/-(ఒక లక్ష యాభై వేల రూపాయలు)లు విరాళం గా అందచేసినట్లైతే ప్రతి సంవత్సరం వారు కోరిన రోజున హాస్పిటల్ లో పేద రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందచేయబడతాయి. అలాగే దాతను హాస్పిటల్ కు ఆహ్వానించి హాస్పిటల్ కి అనుబంధంగా నడుస్తున్న సంజీవ హనుమాన్ గుడిలో వారి పేరు మీద పూజ చేయించి, రోగులకు వారి చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేయిస్తారు.

అలాగే రూ. 10,000/-లు (పది వేలు)విరాళం గా అందచేసినట్లైతే సంవత్సరంలో ఒకరోజు దాత కోరిన రోజున ఎవరైనా ఒక పేద రోగికి ఉచితంగా వైద్య సేవలు అందించబడతాయి. అలాగే దాతను హాస్పిటల్ కు ఆహ్వానించి సంజీవ హనుమాన్ గుడిలో దాత పేరుమీద పూజ చేయించి దాత చేతుల మీదుగా రోగులకు పండ్ల పంపిణీ చేయబడతాయి. అలా శాశ్వత సభ్యత్వం మరియు సంవత్సర సభ్యత్వాలను ప్రస్తుతం 83 మంది తీసుకున్నారు. అలా సమాజంలో సహృదయ భావాలు కలిగిన వారు ఈ “సంజీవని వైద్య సేవా పథకం”లో చేరవలసిందిగా హాస్పిటల్ వర్గాలు కోరుతున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీ సోహన్ లాల్ జైన్, J.P జైన్, హాస్పిటల్ చైర్మన్ శ్రీ P.సీతా రామిరెడ్డి , ప్రధాన కార్యదర్శి శ్రీ N హరికుమార్ రెడ్డి , ట్రస్ట్ సభ్యులు మరియు దాతలు పాల్గొన్నారు.

ఛారిటబుల్ ట్రస్ట్ సందర్శన :

అనంతరం  డాక్టర్ సుకుమార్ గారు నెల్లూరు నగరంలో వసంత లక్ష్మి ఛారిటీ వారు నిర్వహిస్తున్న నిరాశ్రయ  బాల బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ వివరాలను ట్రస్టు వారినడిగి తెలుసుకున్నారు. పిల్లలను వారి పేర్లడిగి తెలుసుకున్నారు. వివిధ సీజన్లలో పిల్లలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ పద్ధతులను నిర్వాహకులకు వివరించారు. పిల్లల పెంపకము, విద్యాభ్యాసములలో తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి వివరించారు.  ట్రస్టు నిర్వాహకురాలు శ్రీమతి వసంతలక్ష్మి ఆద్యంతం వారితో వుండి వివరాలు తెలిపారు. అనంతరం ట్రస్టు నిర్వాహకులు, సిబ్బంది, బాల బాలికలు డాక్టర్ సుకుమార్ గారితో కలిసి ఫోటోలు దిగారు.