NewsProgramms

భక్త కన్నప్ప ఆవాస విద్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

235views

ర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గోకవరం గ్రామంలో సేవాభారతి అధ్వర్యంలో నడిచే భక్తకన్నప్ప ఆవాస గురుకులంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ A. లక్ష్మీ కాంత రెడ్డి మాట్లాడుతూ ఎందరో వీరులు, త్యాగధనుల పోరాట ఫలితమే మన నేటి స్వాతంత్ర్యమని, వారు చిందించిన రక్తంతో పండిన స్వాతంత్ర్య ఫలాలను మనం నేడు అనుభవిస్తున్నామని దానిని కాపాడుకోవాలంటే దేశంలోని జాతి వ్యతిరేక శక్తుల ఆట కట్టించాల్సిన అవసరమున్నదని అన్నారు.

ఆవాస కార్యదర్శి శ్రీ M. రఘురాములు మాట్లాడుతూ ఈ భూమి మన తల్లి అని, ఒక పుత్రుడు తల్లిని ఏవిధంగా ఆరాధించి, కాపాడుకుంటాడో, తల్లి పట్ల ఎలాంటి కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తాడో ఈ భూమి బిడ్డలమైన మనం కూడా తల్లి భారతిని ఆరాధించాలని, ఈ భూమిలోని అణువణువూ మనకు పవిత్రమైనదని, మాతృభూమి పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యమని తెలిపారు. ఈ వేడుకలలో బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ భక్తి గీతాలతో, వివిధ ప్రదర్శనలతో అలరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆవాసప్రముఖ్ శ్రీ M. రామకృష్ణ పాల్గొన్నారు.