NewsProgramms

ఆత్మకూరులో ఉద్యమంలా రక్షాబంధన్

500views

నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో  JOIN RSS  కార్యక్రమం జరిగింది. ఆరెస్సెస్ ఆదర్శాలను వివరిస్తూ యువకులు నగరంలో ఊరేగింపు నిర్వహించారు. అనేక మంది యువకులు తాము ఆరెస్సెస్ కార్యకలాపాలలో పాలు పంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. కార్యకర్తలు ఆ యువకుల పేర్లు, ఫోన్ నంబర్లు నమోదు చేసుకున్నారు. వారందరినీ ఆరెస్సెస్ దైనందిన శాఖకు హాజరు కావలసినదిగా కోరారు. అంతే కాక శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా బస్టాండ్ లో టెంట్ వేసి 8000 మంది పురప్రజలకు రాఖీలు కట్టారు. నగరమంతా కలియదిరుగుతూ వివిధ కూడళ్ళ వద్ద ప్రజలకు రాఖీలు కట్టారు. నగరంలోని ప్రముఖులకు, వైద్యులకు, పోలీస్ అధికారులకు కూడా రాఖీలు కట్టి మనమంతా ఒకే తల్లి భారతమాత సంతానమని, మన మధ్య అంతరాలు లేవని చాటారు.