NewsProgramms

సేవాభారతి అభ్యాసికల బాల బాలికల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

119views

సేవాభారతి విజయవాడ వారి అధ్వర్యంలో విజయవాడలో మొత్తం 33 అభ్యాసికలు (ఉచిత ట్యూషన్ సెంటర్లు) నడుస్తున్నాయి. వీటిలోని 25 అభ్యాసికలలో స్వాతంత్ర్య దినిత్సవ వేడుకలు, రక్షాబంధన్ ఉత్సవాలు జరిగాయి. ఈ అభ్యాసికలలోని బాల బాలికలు మారు మూల ప్రాంతాల ప్రజలకు సైతం రక్షాబంధన్ విశిష్టతను తెలిపి రాఖీలు కట్టారు. “నేను నీకు రక్ష – నీవు నాకు రక్ష – మనం దేశానికి, ధర్మానికి రక్ష” అనే నినాదంతో ఒకరికొకరు అండగా నిలవాలనే భావనను నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో అభ్యాసికల ఉపాద్యాయినీ ఉపాద్యాయుల తోపాటు సేవా భారతి కమిటీ సభ్యురాలు శ్రీమతి బోయపాటి మాధురి, స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ శ్రీ బోయపాటి నాని మరియు సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.