పుష్పాలంకృతుడైన కాణిపాక వరసిద్ధుడు
చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా పూలంగిసేవ పురస్కరించుకుని స్వామివారు శుక్రవారం రాత్రి పుష్పాలంకృతులై భక్తులను కనువిందు చేశారు. ఉత్సవ ఉభయదారులచే స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. మూలవిరాట్టు, అంతరాలయం, మహా మండ పం, మూషిక...









