
323views
ఉత్తరప్రదేశ్ లోని జ్ఞానవాపీ మసీదులో నిర్వహిస్తున్న శాస్త్రీయ సర్వే గడువును మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్టు వారణాసిలోని ఓ కోర్టు తెలిపింది. ఇక ఇంతకు మించి గడువును పెంచలేమని వెల్లడించింది. వాస్తవానికి పురావస్తు శాఖ ఈ నెల 6న నివేదికను సమర్పించాలి.అయితే గడువును పొడించాలన్న విజ్ఞప్తిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. మరో నాలుగు వారాల్లోగా సర్వే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది.




