
423views
వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో రైల్వే శాఖ సాధారణ ప్రజలకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకునే పూర్తి ఏసీతో ఉండే వందేభారత్ రైలు ఎక్కాలని సామాన్య జనానికి కోరిక ఉన్నా, రూ.1,600 టికెట్ ధర చూసి వారు వెనకడుగు వేస్తున్నా రు. మరింత సౌకర్యవంతంగా ఉండే ఎగ్జిక్యూటివ్ కోచ్ టికెట్ ధర ఏకంగా రూ.2,550 ఉండటంతో మామూలు ప్రయాణికులు అటు వైపు చూసే పరిస్థితి కూడా లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు అతి సాధారణ జనానికి కూడా కొంతమేర వందేభారత్ రైలు అనుభూతిని కలిగించేందుకు రైల్వే శాఖ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మరో మూడు నెలల్లో నాన్ ఏసీ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. ‘వందే సాధారణ్’నాన్ ఏసీ రైలు కోచ్‌లను రైల్వే శాఖ వేగంగా సిద్ధం చేస్తోంది.




