News

భారత్‌ నుంచి దౌత్యవేత్తలను తరలించిన కెనడా

390views

ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి భారత్‌ సూచించిన నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది.ఈ నేపథ్యంలో భారత్‌లోని తమ దౌత్యవేత్తలను సింగపూర్‌, కౌలాలంపూర్‌కు కెనడా తరలించినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 60 మందికి పైగా కెనడా దౌత్య సిబ్బంది ఉండగా.. అందులో 41 మందిని ఒట్టావా వెనక్కి పిలిపించుకోవాలని భారత్‌ సూచించినట్లు సమాచారం.