
387views
చిత్తూరు జిల్లాలోని కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ప్రత్యేకోత్సవాల్లో భాగంగా పూలంగిసేవ పురస్కరించుకుని స్వామివారు శుక్రవారం రాత్రి పుష్పాలంకృతులై భక్తులను కనువిందు చేశారు. ఉత్సవ ఉభయదారులచే స్వామివారి మూలవిగ్రహానికి పంచామృతాభిషేకం చేశారు. మూలవిరాట్టు, అంతరాలయం, మహా మండ పం, మూషిక మండపం, ధ్వజస్తంభాలకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. సిద్ధిబుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి మండపంలో ఉంచి రథ, నక్షత్ర, కుంభ, మహా హారతులతో పాటు వివిధ రకాల హారతులు సమర్పించారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించారు.




