News

₹2వేల నోట్లకు రేపే డెడ్‌లైన్‌.. ఇంకా ₹12 వేల కోట్లు పెండింగ్‌

441views

రెండు వేల నోట్ల (2000 Notes) మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న వేళ ఆర్‌బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది. ఇంకా రూ.12వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటించే సమయానికి 3.56 లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. అందులో రూ.3.44 లక్షల కోట్లు వెనక్కి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని పేర్కొన్నారు. 2వేల రూపాయల నోట్ల డిపాజిట్‌ కోసం సెప్టెంబర్‌ 30 వరకు ఇచ్చిన గడువును ఇటీవల ఆర్‌బీఐ పొడిగించిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 7తో ఆ గడువు కూడా ముగియనుంది.