News

ఇరాన్‌కు చెందిన నర్గేస్‌ మొహమ్మదికు నోబెల్‌ శాంతి బహుమతి

347views

2023 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని ఇరాన్‌కు చెందిన మహిళా సామాజిక కార్యకర్త నర్గేస్‌ మొహమ్మదిని వరించింది. నర్గేస్‌ మొహమ్మది.. ఇరాన్‌లో మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఆమెను శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు నోబెల్‌ కమిటీ తెలిపింది. ఇరాన్‌ మహిళల కోసం నర్గేస్‌ మొహమ్మది వీరోచిత పోరాటం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసింది . ఐదుసార్లు ఆమెను దోషిగా నిర్ధారించి మొత్తం 31 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. మహ్మదీ ఇంకా జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు.ఇరాన్‌లో రాజకీయ ఖైదీలు, ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా నర్గేస్‌ జైల్లోనే ఉద్యమం ప్రారంభించారు. అక్కడ కూడా ఆమెకు మద్దతుదారులు పెరగడంతో జైలు అధికారులు ఆమెకు కఠిన ఆంక్షలు విధించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తన పోరాటాన్ని కొనసాగించారని నోబెల్‌ కమిటీ తెలిపింది.