News

ఆసియా క్రీడల్లో 90కి చేరిన భారత్ పతకాల సంఖ్య

390views

ఆసియా క్రీడల చరిత్రలో భారత్ తొలిసారి మూడంకెల పతకాలను సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈసారి ‘వంద’ పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు.భారత్‌కు ఇవాళ నాలుగు పతకాలు వచ్చాయి. ఒక్కటి మినహా మిగతావన్నీ కాంస్య పతకాలు కావడం గమనార్హం. రికర్వ్‌ ఆర్చరీ టీమ్‌ ఈవెంట్‌లో భారత బృందం ఫైనల్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో రజత పతకం దక్కించుకోగలిగింది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రణయ్‌ కు కాంస్య పతకం దక్కింది. భారత మహిళల రికర్వ్‌ ఆర్చరీ జట్టు వియత్నాంపై గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది. సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళా జట్టు కాంస్యం గెలుచుకుంది.

గత ఆసియా గేమ్స్‌లో (2018) భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది. ఈసారి క్రీడల్లో ప్రస్తుతం 90 పతకాలతో నాలుగో స్థానంలో ఉంది. వీటిలో 21 స్వర్ణాలు, 33 రజతాలు, 36 కాంస్య పతకాలు ఉన్నాయి. మరికొన్ని పోటీల్లో పతకాలు ఇప్పటికే ఖాయం కాగా.. కీలక రెజ్లర్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.