News

తుళ్లూరు శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన..

30views

అమరావతి: రాజధాని అమరావతిలోని తుళ్లూరులో వందల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రభుత్వ సహకారంతో గ్రామస్థులు పురాతన ఆలయాన్ని తిరిగి నిర్మిస్తున్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ బాల కోటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. తుళ్లూరు శివాలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందన్నారు. పురాతన ఆలయాన్ని పునర్నిర్మించడం ద్వారా తుళ్లూరు ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవం మరింత ఇనుమడిస్తుందని తెలిపారు.