
23views
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించే వివిధ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ఆలయ సంప్రదాయాలను భక్తులకు మరింత చేరువ చేసేందుకు ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు కొత్తగా ‘శబరిమల సందేశం’ పేరుతో ఆంగ్ల మాస పత్రికను ప్రారంభించింది.
ఈ పత్రిక తొలి ప్రతిని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె. మురళీధరన్ విడుదల చేశారు. శబరిమల ఆలయానికి సంబంధించిన పూజా విధానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంప్రదాయాలు, విశేషాలను భక్తులకు తెలియజేయడం ఈ పత్రిక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
‘శబరిమల సందేశం’ ఆంగ్లంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆలయ విశేషాలు, సంప్రదాయాలను తమకు సులభంగా అర్థమయ్యే భాషలో తెలుసుకునే అవకాశం కలగనుంది.





