
612views
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర నీలకంఠేశ్వర స్వామి ఆలయ భూములలో సచివాలయ నిర్మాణానికి చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదని ఆలయ అర్చక ప్రతినిధుల తోపాటు జింకి భద్ర గ్రామస్తులు, భాజపా నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో శివాజీ పాణిగ్రాహికి ఆ మేరకు వినతి పత్రం అందజేస్తూ సంబంధిత స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణానికి గ్రామస్తులు పూనుకోగా ప్రభుత్వ వర్గాలు సచివాలయం పేరిట చదును చేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడం సరికాదని అన్నారు. ఆలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించే ఆలోచనలను ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని మండల భాజపా అధ్యక్షుడు జిణగ లీలాధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు ఊనా పాండురంగారావు, మరికొందరు గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.





