News

ఆర్ధిక రంగంలో భారత్‌ తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది -ఐఎంఎఫ్ ఎం.డి

575views

త సంవత్సరం భారత్‌ తీవ్ర ఆర్థిక మందగమన పరిస్థితులు ఎదుర్కొందని, అయితే అది ఆర్ధిక సంక్షోభంలోకి మాత్రం వెళ్లలేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జియెవా తెలిపారు. బ్యాంకింగేతర రంగంలో నెలకొన్న ఒడిదుడుకులు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయాల వల్లే భారత ఆర్థిక రంగం కుదుపులకు లోనైందని అభిప్రాయడ్డారు. 2020లో 5.8శాతం, 2021లో 6.5శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. నేడు కేంద్ర బడ్జెట్‌ పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో ఐఎంఎఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్‌ తీసుకున్న అనేక కీలక నిర్ణయాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని క్రిస్టియానా అభిప్రాయపడడ్డారు. అయితే భారీ ఆర్థిక లోటుకు భారత్‌లో పరిస్థితులు లేవని.. నేడు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వీటిని ఎలా సర్దుబాటు చేశారన్నది గమనించాల్సి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే భారత్‌ తీసుకోబోయే ఆర్థికపరమైన నిర్ణయాలు, బడ్జెట్‌పై ఐఎంఎఫ్‌ ఆశావహ దృక్పథంతోనే ఉందని తెలిపారు. కానీ, బడ్జెట్‌ ఆదాయం లక్ష్యం కంటే తక్కువగా ఉంటుండడమే ఆందోళన కలిగిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.