News

మహానంది ప్రాంతంలో ఆర్. ఎస్. ఎస్ సేవలు

1kviews

ఆర్. ఎస్. ఎస్   అంటే “రెడీ ఫర్ సెల్ఫ్ లెస్ సర్వీస్” అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకొనే సందర్బాలను జ్ణప్తికి తెచ్చేలా కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో కురిసిన భారీ వర్షాలకు సంఘమిత్ర చిన్నారులు, స్వయం సేవకులు సంఘమిత్ర కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్ మార్గదర్శనంలో మహానంది మండలంలోని గాజుల పల్లి, ప్రముఖ శైవక్షేత్రం మహానంది పరిసర ప్రాంతలలో పర్యటించి ముంపునకు గురైన ప్రాంత ప్రజలకు భరోసా కల్పించటంతోపాటు సంఘమిత్ర  సంచార వైద్యశాల సహకారంతో అనారోగ్యంగా ఉన్నవారిని గుర్తించి డాక్టరు గారి పర్యవేక్షణలో తగిన పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులు అందించారు. వరదల కారణంగా మురికిగా మారిన గరుడ నంది ప్రాంతాన్ని యుద్ద ప్రాతిపదికన శుభ్రం చేసి యథాస్థితిని పునరుద్ధరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.