News

అయ్యప్ప మాల ధరించిన హిందూ ఉద్యోగికి TCSలో అవమానం?కార్యాలయం ఎదుట భక్తుల ఆందోళన.

31views

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి మాల ధరించి విధులకు హాజరైన హిందూ ఉద్యోగిని కార్యాలయంలోకి అనుమతించలేదనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యప్ప భక్తులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు TCS కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

అసలేం జరిగింది?
అందిన సమాచారం ప్రకారం.. మనీష్ యాదవ్ 2024 నుంచి ఆదిభట్లలోని TCS కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఆగస్టు 2026లో అయ్యప్ప మాల ధరించేందుకు అనుమతి కోరినప్పటికీ తన టీమ్ నుంచి స్పందన రాలేదని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. నవంబర్ 18న మరోసారి తన మేనేజర్‌కు మాల ధరించనున్నట్లు తెలియజేశారు. నవంబర్ 19న అయ్యప్ప మాల ధరించి కార్యాలయానికి వెళ్లినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదని ఆరోపణలు వెలువడ్డాయి. అదే సమయంలో సెలవు కూడా మంజూరు చేయలేదని సమాచారం. ఇతర ప్రాజెక్టులు, టీమ్‌లలో పనిచేస్తున్న ఉద్యోగులు అయ్యప్ప మాల ధరించి విధులకు హాజరవుతున్నప్పటికీ, తన విషయంలో మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని మనీష్ ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. సెలవు మంజూరు చేయాలని లేదా వేరే ప్రాజెక్టుకు బదిలీ చేయాలని కోరినా స్పందన లభించలేదనే ఆరోపణలు ఉన్నాయి.

TCS కార్యాలయం ఎదుట అయ్యప్ప భక్తుల నిరసన
ఉద్యోగిని కార్యాలయంలోకి అనుమతించలేదనే విషయం తెలుసుకున్న పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, వివిధ హిందూ సంఘాల నాయకులు TCS కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయ్యప్ప దీక్షా వస్త్రాలతోనే ఉద్యోగిని విధుల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. భక్తుల ఆందోళనతో కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.

ఉద్యోగుల మత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి\!
అయ్యప్ప మాల ధరించడం కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన పవిత్రమైన దీక్ష. ఉద్యోగుల మత విశ్వాసాలను గౌరవించడంతో పాటు కార్యాలయ నిబంధనలు అందరికీ సమానంగా వర్తించేలా చూడాల్సిన బాధ్యత సంస్థలపై ఉంది.