
న్యూయార్క్ నగర అధికారి జోహ్రాన్ మామ్దానీ హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 17న న్యూయార్క్లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన తన కుటుంబంలోని హిందూ నేపథ్యాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
తన తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవారని పేర్కొన్న మామ్దానీ, చిన్నప్పటి నుంచే హిందూ పండుగలు, సంప్రదాయాలు, ఆచారాల మధ్య పెరిగానని తెలిపారు.
హిందూ ధర్మంలోని అపారమైన జ్ఞానాన్ని ప్రశంసించిన ఆయన.. **రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలు కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, నైతిక బాధ్యతలను నేర్పించే గొప్ప విజ్ఞాన సంపదలు అని కొనియాడారు.
అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షను తీవ్రంగా ఖండించారు.
మత సామరస్యం, ఐక్యతే సమాజానికి బలమని పేర్కొన్న మామ్దానీ.. మతపరమైన ద్వేషాన్ని, విభజన రాజకీయాలను ప్రతి ఒక్కరూ తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఏ మతానికి చెందిన వారైనా, ఏ నేపథ్యం నుంచి వచ్చిన వారైనా సమాజంలో గౌరవంగా, సురక్షితంగా జీవించే వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.





