
బ్రిటన్‌లోని ఆస్పత్రులు మాత్రం రేప్‌లు, లైంగిక వేధింపులు, హింసాత్మక దాడులకు వేదికగా నిలుస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు దేశంలోని ఆస్పత్రుల్లో సిబ్బంది, రోగులు, సహాయకులపై 6,500కిపైగా అత్యాచార, లైంగిక వేధింపులు, దాడుల కేసులు నమోదైనట్టు గతవారం ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. యూకేలోని మహిళా హక్కుల నెట్‌వర్క్.. దేశవ్యాప్తంగా జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించిన గణాంకాలను గతవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో లైంగిక దాడులను అరికట్టే చర్యల్లో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య సంస్థల్లో పనిచేసే నర్సులు, ఆరోగ్య సిబ్బంది ఇకపై బాడీ కెమెరాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆరోగ్య శాఖ కార్యదర్శి స్టీవ్ బార్క్‌లే హెల్త్‌కేర్ వర్కర్లకు కూడా పోలీసుల తరహాలో బాడీ కెమెరాలు ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చారు. నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎ్‌స)తో కలిసి ఆరోగ్య శాఖ ఈ నిబంధనను అమలు చేయనుంది.




