
335views
వారణసీలో ఈ నెల 29న జరగనున్న తెలుగు సంగమం కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. గంగా పుష్కరాలను పురస్కరించుకొని కాశీకి చేరుకుంటున్న వేలాది మంది తెలుగు యాత్రికులను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగిస్తారు. తెలుగు వారికోసం ఆశ్రమాలు, ధర్మశాలలు నడుపుతున్న శ్రీ కాశీ సమితి మానసరోవర్ ఘాట్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాశీతో ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు పురాతన కాలం నుంచి ఉన్న అనుబంధాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు.





