
393views
కేరళ రాష్ట్రంలో మొట్టమొదటి వందేభారత్ రైలుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతాన్మిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్ గడ్ జిల్లాల మీదుగా నడుస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. రైలు ప్రారంభించే ముందు ప్రధాని మోదీ వందేభారత్ రైలులోని పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లతో కలిసి ప్రధాని ఈ రైలును ప్రారంభించారు.





