
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్ మంత్రి, ఇమ్రాన్ పార్టీ సీనియర్ మంత్రి అబైద్ ఉల్లా బేగ్‌ను శుక్రవారం ఉగ్రవాదులు అపహరించారు. ఒప్పందం అనంతరం శనివారం ఆయన విడుదలయ్యారు. బేగ్ ఇస్లామాబాద్ నుండి గిల్గిట్‌కు వెళ్తున్న సమయంలో ఆయనను పాకిస్తాన్ రాడికల్ సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రవాదులు అపహరించారు.
ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. జైలులో ఉన్న తమ సహచరులను విడిపించాలన్న డిమాండ్‌తో కూడిన వీడియో క్లిప్‌ను ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన మంత్రి చూపించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉగ్రవాదుల చెర నుంచి విడుదలైన అనంతరం మంత్రి అబైదుల్లా బేగ్ మాట్లాడుతూ తాను ఇస్లామాబాద్ నుంచి గిల్గిత్ వెళ్తుండగా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. నంగా పర్బత్ ప్రాంతంలోగిల్గిత్-బాల్టిస్థాన్ మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ కమాండర్ అయిన హబీబుర్ రెహ్మాన్, అతడి అనుచరులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో థాక్ గ్రామంలో రహదారిని బ్లాక్ చేసి మంత్రిని కిడ్నాప్ చేశారు.
Source: Nijamtoday





