News

ప‌ర్యాట‌కుల‌తో క‌శ్మీర్ క‌ళ‌.. కళ‌

216views

క‌శ్మీర్‌: క‌శ్మీర్‌లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఒక వంక పెద్ద సంఖ్యలో జ‌మ్మూక‌శ్మీర్‌కు ప‌ర్యాట‌కులు వస్తుండగా, మరోవంక స్థానిక ఉగ్రవాదుల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోతున్నది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ క్రమంగా ప్రశాంతత నెలకొంటున్న స్పష్టమైన సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప్రాంతాన్ని 1.62 కోట్ల మంది ప‌ర్యాట‌కులు సందర్శించినట్టు ఓ అధికారి వెల్ల‌డించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జ‌మ్మూక‌శ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంద‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని ఆ అధికారి తెలిపారు. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత మ‌ళ్ళీ అధిక స్థాయిలో ల‌క్ష‌లాది మంది టూరిస్టులు క‌శ్మీర్‌కు వ‌స్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

క‌శ్మీర్ టూరిజంలో మ‌ళ్ళీ స్వ‌ర్ణ‌యుగం మొద‌లైన‌ట్టు భావిస్తున్నారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో టూరిజ‌మే అతిపెద్ద ఉపాధి. 2022 జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది ప‌ర్యాట‌కులు క‌శ్మీర్‌ను సందర్శించినట్టు అధికారులు తెలిపారు. 75 ఏళ్ళ‌ స్వాతంత్య్ర భార‌త్‌లో అత్య‌ధిక స్థాయిలో ప‌ర్యాట‌కులు రావ‌డం ఇదే మొద‌టిసారి అని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి