
360views
గాంధీనగర్: వందే భారత్ రైలును జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర రాజధాని నగరాలను కలుపుతూ నడిచే ఈ రైలులో ప్రయాణించే వారికి విమానంలో ప్రయాణించిన అనుభూతి కలుగుతుంది.
ఈ ప్రయాణంలో రైల్వే కుటుంబానికి చెందిన వారు, మహిళా పారిశ్రామికవేత్తలు. యువకులతో సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఆయన సహ-ప్రయాణికులు అని పిఎమ్‌ఒ తెలిపింది. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ కేపిటల్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆకుపచ్చ జెండాను ఊపి మోదీ ఈ రైలును ప్రారంభించారు.





