News

కాబుల్‌లో బాంబు పేలుడు… భారీగా ప్రాణ న‌ష్టం!

395views

కాబుల్‌: ఆప్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ద‌స్తే బార్చి ఏరియాలోని కాజ్ ఎడ్యుకేష‌న్ సెంట‌ర్ వ‌ద్ద భారీ పేలుడు సంభ‌వించింది. విద్యార్థులు యూనివ‌ర్సిటీ ఎగ్జామ్ రాస్తుండ‌గా ఈ పేలుడు సంభ‌వించిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ పేలుళ్ళ‌పై స్థానిక జ‌ర్న‌లిస్ట్ బిలాల్ స‌ర్వారీ ట్వీట్ చేశారు.

భారీ పేలుడు నేప‌థ్యంలో భారీగా ప్రాణన‌ష్టం సంభ‌వించి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. క్లాస్ రూమ్ మొత్తం ర‌క్తంతో నిండిపోయింది. యూనివ‌ర్సిటీ ఎంట్రెన్స్ మాక్ టెస్టు రాస్తుండ‌గా పేలుడు సంభ‌వించినట్టు జ‌ర్న‌లిస్టు పేర్కొన్నాడు. విద్యార్థుల శ‌రీర భాగాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయ‌ని తెలిపాడు. పశ్చిమ కాబూల్‌లోని దష్తే బార్చెను లక్ష్యంగా చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసిన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు నిత్యం ఇక్కడ మారణహోమానికి తెగబడుతూ ఉంటారు. విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఉగ్రవాది క్లాసురూములోకి చొరబడి తనను తాను పేల్చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి