News

పీఎఫ్​ఐను నిషేధించిన కేంద్రం!

402views
  • ఉపా చట్టం కింద ఐదేళ్ళు బ్యాన్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాపులర్​ ఫ్రంట్ ఆఫ్​​ ఇండియా(పీఎఫ్​ఐ)పై నిషేధం విధించింది. పీఎఫ్​ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ళ‌పాటు బ్యాన్​ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్​ ఆఫ్​ ఇండియా-పీఎఫ్​ఐపై కేంద్ర సంస్థలు మంగళవారం మరోమారు గురిపెట్టాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్​ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఏడు రాష్ట్రాల్లో పీఎఫ్​ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్​లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్టు ఎన్​ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి