
407views
తిరుపతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ శుక్రవారం టీటీడీ ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు.





