
321views
ఉజ్బెకిస్థాన్: మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఒ) సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఈ దేశాల పాత్ర, ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెబుతూ దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఈ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు అనుసంధానతను సాధించేందుకు మెరుగైన సరఫరా కలిగి ఉండాలని ఆయన సూచించారు.
Source: Nijamtoday





