News

టీటీడీకి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం

356views

తిరుప‌తి: కరూర్ వైశ్యా బ్యాంక్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్‌ )లో భాగంగా గురువారం ఉద‌యం టీటీడీకి సుమారు రూ.30 లక్షల విలువైన 8-సీట్లు క‌లిగి బ్యాటరీతో నడిచే ఐదు వాహనాలను విరాళంగా అందించారు.

శ్రీ‌వారి ఆలయం ముందు వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం కెవిబి మేనేజింగ్ డైరెక్టర్ బి.రమేష్ బాబు టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి బ్యాటరీ వాహనాల తాళాలు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కెవిబి డైరెక్టర్లు, విజివో శ్రీ బాలిరెడ్డి, డిఐ శ్రీ జానకిరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Source: TTDNews

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి