News

రేపటి నుంచి చార్ ధామ్ యాత్ర

6views

ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో ఈ నెల 19 నుంచి చార్ ధామ్ యాత్ర సందడి మొదలుకానుంది. అక్షయ తృతీయ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 22 నుంచి రుద్రప్రయాగ్లోని కేదార్నాథ్, 23 నుంచి చమోలీలోని బద్రీనాథ్ ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తారు. రాష్ట్ర అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించింది. యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామీ సమీక్షించారు.

గౌచర్ పట్టణం నుంచి బద్రీనాథ్ కు (132 కి. మీ.) ఈ ఏడాది మొదటిసారిగా హెలికాప్టర్ షటిల్ సర్వీసును ప్రారంభిస్తున్నారు. ఈ సదుపాయం వృద్ధులకు ఎంతో ప్రయోజనకరం కానుందని, ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసి నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. దిల్లీ -దేహ్రాదూన్ ఎక్స్ ప్రెస్ వే కూడా అందుబాటులోకి వచ్చి ప్రయాణ సమయం బాగా తగ్గింది.